Gold Price: బంగారం షాక్..భారీగా పెరిగిన పసిడి..వెండీ అదే దారిలో..
బంగారం ధరలు అటూ ఇటూ కదులుతూ వస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు అంతకు మించి పైకెగాశాయి. భారీ పెరుగుదల ను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు ఏడువందల ఏభై రూపాయల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర కూడా ఎగబాకింది. ఏకంగా కేజీ వెండి 5 వందలకు పైగా పెరిగింది.
హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (21.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 750 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,090 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 750 రూపాయల పెరుగుదలతో 42,670 రూపాయలు నమోదు చేసింది.
భారీగా పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా ఎగశాయి. కేజీ వెండి ధర ఒక్కసారిగా 510 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,500 రూపాయల వద్దకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నం లలో..
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 750 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,090 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 750 రూపాయల పెరుగుదలతో 42,670 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. 40 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 40,500 రూపాయల వద్దకు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భగ్గు మన్నాయి భారీగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 750 రూపాయల పెరుగుదలతో 41,100 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1100 రూపాయల పెరుగుదలతో 39,900 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగాపెరిగాయి. 40 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది కేజీ వెండి ధర 40,500 రూపాయల వద్దకు ఎగసింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




