Gold Rate Today: పరుగులు తీస్తున్న బంగారం.. స్థిరంగా వెండి ధరలు

K V D Varma
Updated on: 21 Feb 2020 11:05 AM IST
Gold Rate Today: పరుగులు తీస్తున్న బంగారం.. స్థిరంగా వెండి ధరలు
X
బంగారం ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం కూడా బంగారం ధరలు ఎగసిపడ్డాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు భారీ పెరుగుదల నమోదుచేసింది. ఏకంగా 300 రూపాయలు ఎగసింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 43,120 రూపాయల నుంచి 43,420 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పైకెగసింది. 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగింది. దీంతో 39,650 రూపాయల నుంచి 39,800 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది..

ఎగసిన వెండి ధరలు..

బంగారం ధరతో పాటు, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. దీంతో వెండి ధర నిన్నటి కేజీ కి 49,900 రూపాయల ధర వద్ద నిలిచింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 43,420 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,800 రూపాయలు నమోదు చేశాయి. కాగా వెండి ధర లు ఇక్కడా నిలకడగా ఉన్నాయి. దీంతో కెజీ వెండీ 49,900 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లు భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 300 రూపాయలు ఎగసి 41,850 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయలు పెరిగి 40,650 రూపాయల వద్దకు చేరింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరిగింది.. దీంతో కేజీ వెండి 49,900 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story