ఈరోజూ బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కిందికే!
బంగారం ధరలు రెండో రోజూ కిందికి దిగొచ్చాయి. ఈరోజు (ఏప్రిల్ 20) బంగారం ధరలు పది గ్రాములకు 90 రూపాయల వరకూ తగ్గాయి. మరో వైపు వెండి ధరలు కూడా ఈరోజు కిందికి దిగొచ్చాయి. కేజీకి 50 రూపాయల తగ్గుదల కనబరిచాయి.
బంగారం ధరలు ఈరోజు కూడా కిందికి దిగొచ్చాయి. సోమవారం (20.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 90 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,510 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 90 రూపాయల తగ్గుదలతో 44,200 రూపాయలు నమోదు చేసింది.
పడిపోయిన వెండి ధరలు...
బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు దగ్గరలో కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,150 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 90 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,510 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 90 రూపాయల తగ్గుదలతో 44,200 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,150 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. 22 క్యారెట్ల బంగారం కాస్త పెరుగుదల దిశలో పయనించగా..24 క్యారెట్ల బంగారం మాత్రం దిగొచ్చింది.. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయల తగ్గుదలతో 44,550 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయల పెరుగుదలతో 41,980 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 41 వేల మార్కుకు చేరువలో నిలిచింది. కేజీ వెండి ధర 41,150 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




