భగ్గుమన్న బంగారం..వెండి ధరలూ అదే దారిలో!

K V D Varma
Published on: 20 Feb 2020 7:54 AM IST
భగ్గుమన్న బంగారం..వెండి ధరలూ అదే దారిలో!
X

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు ఎగసిపడ్డాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు భారీ పెరుగుదల నమోదుచేసింది. ఏకంగా 480 రూపాయలు ఎగసింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 42,640 రూపాయల నుంచి 43,120 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పైకెగసింది. 10 గ్రాములకు 500 రూపాయలు పెరిగింది. దీంతో 39,150 రూపాయల నుంచి 39,650 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది..

ఎగసిన వెండి ధరలు..

బంగారం ధరతో పాటు, వెండి ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి.కేజీ వెండి ధర 350 రూపాయలు పెరిగింది. దీంతో వెండి ధర కేజీ కి 49,900 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 43,120 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,650 రూపాయలు నమోదు చేశాయి. కాగా వెండి ధర లు ఇక్కడా పెరిగాయి.. దీంతో కెజీ వెండీ 49,950 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లు భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయలు ఎగసి 41,550 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయలు పెరిగి 40,350 రూపాయల వద్దకు చేరింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరిగింది.. దీంతో కేజీ వెండి 49,900 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story