ఎగసి పడుతున్న బంగారం.. అందనంత ఎత్తుకు వెండి ధరలు!

K V D Varma
Updated on: 19 May 2020 8:22 AM IST
ఎగసి పడుతున్న బంగారం.. అందనంత ఎత్తుకు వెండి ధరలు!
X
gold rate today

బగారం ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఈరోజు (మే19) బంగారం ధరలు దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ భారీస్థాయిలో పెరిగిపోయాయి.

బంగారం ధరలు ఈరోజూ పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (19.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 390 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,860 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 390 రూపాయల పెరుగుదలతో 48,930 రూపాయలు నమోదు చేసింది.

భారీగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు అమాంతం భారీగా పెరిగాయి. కేజీవెండి ధర నిన్నటి ధరల కంటే 1790 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల గరిష్ట మార్కు దాటి వెండి ధర పైకెగసింది. కేజీ వెండి ధర 48,500 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 390 రూపాయల పెరుగుదల నమోదు చేసి 45,860 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 390 రూపాయల పెరుగుదలతో 48,930 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,000 రూపాయల కంటే పైకెగసి 48,500 రూపాయలు నమోదు చేసింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 390 రూపాయలు పెరిగి 48,900 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 390 రూపాయల పెరుగుదలతో 46,500 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా కేజీకి 1790 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 48,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story