Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. మార్పులేని వెండి ధరలు!

K V D Varma
Updated on: 19 Feb 2020 11:09 AM IST
Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. మార్పులేని వెండి ధరలు!
X

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు మంగళవారం ధరల దగ్గరే స్థిరంగా నిలిచింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 42,640 రూపాయల నుంచి మార్పులు లేకుండా 42,640 రూపాయలవద్దే నిలిచింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 10 గ్రాములకు 20 రూపాయలు తగ్గింది. దీంతో 39,150 రూపాయల నుంచి 39,130 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర దిగొచ్చింది.

నిలకడగా వెండి ధరలు..

బంగారం ధరతో పాటు, వెండి ధరలు కూడా కదలిక్ లేకుండా స్థిరంగా నిలిచాయి. దీంతో వెండి ధర కేజీ కి 49,550 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 42,640 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,130 రూపాయలు నమోదు చేశాయి. కాగా వెండి ధర లు ఇక్కడా నిలకడగా ఉన్నాయి. దీంతో కెజీ వెండీ 49,550 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 41,150 రూపాయలవద్ద నిలకడగా వుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 39,950 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి 49,500 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story