gold rates: భారీగా దిగొచ్చిన బంగారం..వెండి మరింత పతనం!
నిన్న పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు దిగోచ్చాయి. భారీ తగ్గుదలను నమోదు చేశాయి. పది గ్రాముల బంగారం దాదాపు వెయ్యి రూపాయల వరకూ తగ్గుదలను నమోదు చేసింది. ఇక వెండి కూడా అదే బాటలో ఉంది. కేజీ వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది.
హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (18.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 920 రూపాయల తగ్గుదల నమోదు చేసి 38,700 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 920 రూపాయల తగ్గుదలతో 42,300 రూపాయలు నమోదు చేసింది.
భారీగా తగ్గిన వెండి ధరలు...
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. భారీగా వెండి ధర తగ్గడంతో కేజీ వెండి ధర 41,780 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నం లలో..
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 920 రూపాయల తగ్గుదల నమోదు చేసి 38,700 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 920 రూపాయల తగ్గుదలతో 42,300 రూపాయలు నమోదు చేసింది. అదేవిధంగా వెండి ధరలు కూడా తగ్గడంతో కేజీకి 41,780 రూపాయలుగా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగోచ్చాయి.. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 900 రూపాయల తగ్గుదలతో 40,750 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 900 రూపాయల తగ్గుదలతో 39,500 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా 230 రూపాయలు తగ్గి 47,800 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-03-2020 ఉదయం 8 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




