Gold Rate Today: దిగొచ్చిన బంగారం..పైకెగసిన వెండి!

K V D Varma
Updated on: 18 Feb 2020 11:33 AM IST
Gold Rate Today: దిగొచ్చిన బంగారం..పైకెగసిన వెండి!
X

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 140 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 42,780 రూపాయల నుంచి 42,640 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గింది. దీంతో 39,250 రూపాయల నుంచి 39,150 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర దిగొచ్చింది.

నిలకడగా వెండి ధరలు..

బంగారం ధరలు తగ్గినా, వెండి ధరలు మాత్రం పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర 50 రూపాయలు పెరిగింది. దీంతో వెండి ధర 49,550 రూపాయల వద్దకు ఎగసింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 42,640 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,150 రూపాయలు నమోదు చేశాయి. కాగా' వెండి ధర లు ఇక్కడా పైకేగాశాయి. దీంతో కెజీ వెండీ 49,550 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర లు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 160 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41,150 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 160 రూపాయలు తగ్గడంతో 39,950 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి 49,500 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story