Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం..నిలకడగా వెండి!

K V D Varma
Updated on: 17 Feb 2020 10:36 AM IST
Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం..నిలకడగా వెండి!
X
GOld And Silver File Photo

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరియి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 42,370 రూపాయల నుంచి 42',380 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగింది. దీంతో 39,240 రూపాయల నుంచి 39,250 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర ఎగసింది.

నిలకడగా వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగినా, వెండి ధరలు మాత్రం మార్పులు లేకుండా నిలిచాయి. కేజీ వెండి ధర స్థిరంగా వుంది. దీంతో నిన్నటి వెండి ధర 49,500 రూపాయల వద్ద నిలిచింది .

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 42,380 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,250 రూపాయలు నమోదు చేశాయి. కాగా' వెండి ధర లు ఇక్కడా స్థిరంగా ఉన్నాయి. దీంతో కెజీ వెండీ 49,500 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో...

ఇక, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర లు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41,310 రూపాయలకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయలు పెరగడంతో40,110 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా స్థిరంగా వుంది. దీంతో కేజీ వెండి నిన్నటి ధర వద్దే 49,500 రూపాయలు గా నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story