Gold Rate: ఎగసిన బంగారం ధరలు..షాకిచ్చిన వెండి ధరలు!

Gold Rate: బంగారం ధరలు వరుసగా మూడోరోజూ పెరుగుదల బాటలో పయనిస్తే..వెండి ధరలు ఒక్కసారిగా పైకెగసి షాకిచ్చాయి.

K V D Varma
Updated on: 16 Sept 2020 6:55 AM IST
Gold Rate: ఎగసిన బంగారం ధరలు..షాకిచ్చిన వెండి ధరలు!
X

Gold Rate Today

వరుసగా మూడోరొజూ బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 16) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీ పేరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (16.09.2020) బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు పెరిగి 49,520 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 490 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 54,020 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 1200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 69వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 69,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు పెరిగి 49,520 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 490 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 54,020 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ధరతో పోలిస్తే 450 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,450 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ధరతో పోలిస్తే 490 రూపాయలు పైకెగసింది. దాంతో 55,030 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే..కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 1200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 69వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 69,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story