Gold Rate: కొద్దిగా పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలూ పై పైకే.. ఈరోజు రేట్లిలా!

Gold Rate: కొద్దిగా పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలూ పై పైకే.. ఈరోజు రేట్లిలా!
x

Gold rate today 

Highlights

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.

నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 15) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఇక ఢిల్లీ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (15.09.2020) బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయలు పెరిగి 49,070 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,530 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 400 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 68,300 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 170 రూపాయలు పెరిగి 49,070 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,530 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ధరతో పోలిస్తే 150 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ధరతో పోలిస్తే 150 రూపాయలు పైకెగసింది. దాంతో 54,540 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 400 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 68,300 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories