పెరుగుదల బాటలోనే బంగారం.. వెండి మాత్రం కాస్త తగ్గింది!

K V D Varma
Published on: 16 April 2020 6:54 AM IST
పెరుగుదల బాటలోనే బంగారం.. వెండి మాత్రం కాస్త తగ్గింది!
X
Gold rate today (representational image)

బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు (ఏప్రిల్ 16) బంగారం ధరలు పది గ్రాములకు 110 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. కేజీకి 60 రూపాయల తగ్గుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (16.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 41,960 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 110 రూపాయల పెరుగుదలతో 45,760 రూపాయలు నమోదు చేసింది.

తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల కనిపించగా , వెండి ధరలు మాత్రం ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 60 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు దగ్గరలో కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,850 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 41,960 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 110 రూపాయల పెరుగుదలతో 45,760 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,850 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు అదేవిధంగా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయల పెరుగుదలతో 45,910 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయల పెరుగుదలతో 43,650 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కుకు చేరువలో నిలిచింది. కేజీ వెండి ధర 41,850 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story