బాబోయ్! వారంలో పైకెగసిన బంగారం ధరలు.. వెండి కూడా పై చూపులే!!

బాబోయ్! వారంలో పైకెగసిన బంగారం ధరలు.. వెండి కూడా పై చూపులే!!
x
Highlights

బంగారం ధరలు ఈ వారంలో (ఫిబ్రవరి 9 ఆదివారం నుంచి ఫిబ్రవరి 15 శనివారం వరకూ ) భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒడిదుడుకులు.. చైనా లో వ్యాపించిన కరోనా...

బంగారం ధరలు ఈ వారంలో (ఫిబ్రవరి 9 ఆదివారం నుంచి ఫిబ్రవరి 15 శనివారం వరకూ ) భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒడిదుడుకులు.. చైనా లో వ్యాపించిన కరోనా వైరస్ కారణంగా ఎదురైనా వత్తిళ్ళ మధ్య బంగారం ధరలు వారమంతా కిందకీ, పైకీ కదులుతూ వచ్చాయి. అయితే, వారం మొత్తంగా చూసుకుంటే గత ఆదివారం ప్రారంభ ధర నుంచి శనివారం ముగింపు ధర తో పోల్చి చూస్తె బంగారం ధరలు భారీ పెరుగుదలనే నమోదు చేశాయి. దాదాపుగా ప్రతిరోజూ ధరల్లో మార్పు వస్తూనే వుంది.

బంగారం పైకెగసింది ఇలా..

ఫిబ్రవరి 9 ఆదివారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ప్రారంభ ధర 42,530 రూపాయలుగా ఉంది. ఇక నిన్న అంటే ఫిబ్రవరి 15 వ తేదీ శనివారం ముగింపు ధర 42,770 గా వుంది. అంటే పది గ్రాములకు 240 రూపాయలు పెరిగింది. ఇక పోతే, 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఫిబ్రవరి 9 ఆదివారం ప్రారంభధర 38,990 రూపాయలు నమోదు కాగా, నిన్న ఫిబ్రవరి 15 వ తేదీ శనివారం ముగింపు ధర 39,240 రూపాయలుగా నిలిచింది. అంటే 250 రూపాయలు పెరుగుదల నమోదు అయింది. శనివారం ఒక్కరోజే దాదాపుగా 400 రూపాయల వరకూ 10 గ్రాముల బంగారం పైకెగసింది.

వెండి ధరలు ఇలా..

అదేవిధంగా వెండి ధరలూ గత వారంలో పైకీ కిందికీ కదలాడుతూ వచ్చింది.. ఫిబ్రవరి 9 ఆదివారం కేజీ వెండి ధర 49,900 రూపాయల వద్ద ప్రారంభం అయింది. నిన్న ఫిబ్రవరి 15 వ తేదీ శనివారం ముగింపు ధర 49,500 రూపాయలుగా నిలిచింది. అంటే వారం మొత్తమ్మీద 500 రూపాయలు పైకెగసింది. వెండి కూడా బంగారం ధరలతో పాటు హెచ్చు తగ్గులను చూపిస్తూ వచ్చింది. ఒక దశలో అంటే ఫిబ్రవరి 12 వ తేదీ నాటికి 48,800 రూపాయలకు కేజీ వెండి ధర పడిపోయింది. అయితే, తరువాత రెండు రోజుల్లోనూ కాస్త పుంజుకుని వారాంతానికి 49,500 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక ఈవారం కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఆర్ధిక పరిస్థితుల ఒడిదుడుకులు గత వారంలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తుండడం తో బంగారం ధరల్లో కూడా అదే మేరకు ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందంటున్నారు. బంగారం మీద పెట్టుబడులు పెట్టేవార్ ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వార్ సూచిస్తున్నారు. పైన పేర్కొన్న ధరలు దేశవ్యాప్త ధరలు. ఈ ధరల్లో స్థానికంగా కొంత మార్పులు ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ స్థూలంగా చూసుకుంటే బంగారం, వెండి ధరలు గత వారంలో పెరుగుదల నమోదు చేశాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories