బంగారం షాక్.. వెండి ధరలూ అదే రేంజిలో పెరిగాయి!

K V D Varma
Published on: 15 April 2020 7:12 AM IST
బంగారం షాక్..  వెండి ధరలూ అదే రేంజిలో పెరిగాయి!
X
gold rate today in India (representational image)

బంగారం ధరలు వరుసగా ఐదో రోజూ పైకెగాశాయి.. ఈరోజు (ఏప్రిల్ 15) బంగారం ధరలు పది గ్రాములకు 1150 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కూడా కేజీకి 610 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (15.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 1010 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసి 41,850 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 1150 రూపాయల భారీ పెరుగుదలతో 45,550 రూపాయలు నమోదు చేసింది.

పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు కూడా ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 610 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు దగ్గరకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,910 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 1010 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసి 41,850 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1150 రూపాయల భారీ పెరుగుదలతో 45,550 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,960 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు అదేవిధంగా భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 680 రూపాయల పెరుగుదలతో 45,800 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 420 రూపాయల పెరుగుదలతో 43,540 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కుకు చేరువలో వచ్చింది. కేజీ వెండి ధర 41,960 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story