స్వల్పంగా దిగివచ్చిన బంగారం..వెండిదీ అదే దారి!

స్వల్పంగా దిగివచ్చిన బంగారం..వెండిదీ అదే దారి!
x
Highlights

కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా దిగివచ్చాయి. ఈరోజు (మే14) బంగారం ధరలు దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా...

కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా దిగివచ్చాయి. ఈరోజు (మే14) బంగారం ధరలు దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి.

బంగారం ధరలు ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (14.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 260 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,370 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 10 రూపాయల తగ్గుదలతో 47,400 రూపాయలు నమోదు చేసింది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కేజీవెండి ధర నిన్నటి ధరల కంటే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు నుంచి వెండి ధర కిందికి దిగింది. కేజీ వెండి ధర 42,950 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 260 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,370 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 10 రూపాయల తగ్గుదలతో 47,400 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 43,000 రూపాయల కంటే కిందికి దిగివచ్చి 42,950 రూపాయలు నమోదు చేసింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఎటువంటి మార్పూ లేకుండా 46,950 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 200 రూపాయల తగ్గుదలతో 44,950 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా కేజీకి 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 43 వేల మార్కు నుంచి కిందకు దిగివచ్చింది. కేజీ వెండి ధర 42,950 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 14-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories