Gold Price : బంగారం పై పై కి.. స్థిరంగా వెండి!

బంగారం ధరలు పై పైకి కదులుతూనే ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

K V D Varma
Published on: 13 May 2020 6:08 AM IST
Gold Price : బంగారం పై పై కి.. స్థిరంగా వెండి!
X

బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల కనబరిచాయి. ఈరోజు (మే13) బంగారం ధరలు దేశీయంగా పై పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి.

బంగారం ధరలు ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (13.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,630 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 110 రూపాయల పెరుగుదలతో 47,410 రూపాయలు నమోదు చేసింది.

స్థిరంగా వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం స్థిరంగా నిలిచాయి. కేజీవెండి ధర నిన్నటి ధరల వద్దే ఉంది. దీంతో 43 వేల మార్కు వద్ద వెండి ధర నిలిచింది. కేజీ వెండి ధర 43,000 రూపాయల వద్ద ఎటువంటి మార్పులూ లేకుండా నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,630 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 110 రూపాయల పెరుగుదలతో 47,410 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్థిరంగా నిలిచింది. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 43,000 రూపాయల వద్ద కదలిక లేకుండా ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయలు పెరిగి 46,950 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 450 రూపాయల పెరుగుదలతో 45,150 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా మార్పులు లేకుండా ఉంది. దీంతో కేజీ వెండి ధర 43 వేల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 43,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-05-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story