gold rates: రెండో రోజూ తగ్గిన బంగారం..అదే దారిలో వెండి!
కరోనా వైరస్ ప్రభావం ఆర్ధిక రంగం పై గట్టిగానే పడుతోంది. నిన్న స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ప్రభావం బంగారం ధరల మీద కూడా పడింది. అవి కూడా ఆ దారిలోనే భారీ తగ్గుదల వైపు నడిచాయి.నిన్న కొంతవరకూ తగ్గిన బంగారం ధరలు ఈరోజు మరింత తగ్గాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (13.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 520 రూపాయల తగ్గుదల నమోదు చేసి 41,320 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 520 రూపాయల తగ్గుదలతో 45,180 రూపాయలు నమోదు చేసింది.
భారీగా తగ్గిన వెండి ధరలు...
నిన్న నిలకడగా ఉన్నవెండి ధరలు ఈరోజు కాస్త దిగోచ్చాయి. కేజీకి వంద రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో దిగొచ్చిన కేజీ వెండి ధర 48,400 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నం లలో..
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 520 రూపాయల తగ్గుదల నమోదు చేసి 41,320 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 320 రూపాయల తగ్గుదలతో 45,180 రూపాయలు నమోదు చేసింది. అదేవిధంగా వెండి ధరలు కూడా తగ్గడంతో కేజీకి 48,400 రూపాయలుగా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగోచ్చాయి.. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయల తగ్గుదలతో 43,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 500 రూపాయల తగ్గుదలతో 42,350 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా 100 రూపాయలు తగ్గి 48,400 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




