Gold Rate Today: మూడో రోజు తగ్గిన బంగారం.. వెండి అదే దారి!

K V D Varma
Updated on: 13 Feb 2020 11:27 AM IST
Gold Rate Today: మూడో రోజు తగ్గిన బంగారం.. వెండి అదే దారి!
X

వరుసగా మూడో రోజు బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయి . నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు (13.02.2020)బంగారం ధరలు మరింత కిందకి దిగి వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది . 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 40 240 రూపాయల నుంచి 42'150 రూపాయలకు తగ్గింది ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,690 రూపాయల నుంచి 38,600 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర దిగి వచ్చింది

వెండి ధరలు కిందికే...

బంగారం ధరలు దారిలోనే వెండి ధరలు పయనించాయి. కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గింది. దీంతో నిన్నటి వెండి ధర 49,000 నుంచి 48,800 రూపాయలకు దిగివచ్చింది~.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా..

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 38,600 రూపాయలు నమోదు చేయగా వెండి ధర 48,800 రూపాయలకు దిగి వచ్చింది

దేశ రాజధాని ఢిల్లీలో...

ఇక, దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర లు కిందకు దిగి వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 40,650 రూపాయలు దిగి వచ్చింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గడంతో 39,450 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర కూడా 200 రూపాయల తగ్గుదల నమోదు చేసి 48,800 రూపాయలు గా నిలిచింది

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




K V D Varma

K V D Varma

Next Story