మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి!
నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. ఈరోజు (మే12) బంగారం ధరలు దేశీయంగా పై పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీ తగ్గుదల నమోదు చేశాయి.
నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. ఈరోజు (మే12) బంగారం ధరలు దేశీయంగా పై పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా భారీ తగ్గుదల నమోదు చేశాయి.
బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (12.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 310 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,520 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 290 రూపాయల పెరుగుదలతో 47,300 రూపాయలు నమోదు చేసింది.
భారీగా తగ్గిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం భారీ తగ్గుదల నమోదు చేశాయి. కేజీకి ఏకంగా 610 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 43 వేల మార్కు వద్ద వెండి ధర నిలిచింది. కేజీ వెండి ధర 43,000 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 310 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,520 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 290 రూపాయల పెరుగుదలతో 47,300 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 43,000 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 290 రూపాయలు పెరిగి 46,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 290 రూపాయల పెరుగుదలతో 44,700 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 43 వేల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 43,000 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




