Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ..వెండి పై చూపులు!
అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరిగినా. దేశీయంగా కాస్త నేమ్మదించాయి. నిన్నటి ధరల కంటే ఈరోజు (11.02.2020) బంగారం ధర కాస్త తగ్గింది.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 10 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర .42,540 నుంచి రూ.42,530కు తగ్గింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 10 రూపాయలు తగ్గడంతో 38,980 రూపాయల వద్దకు చేరుకుంది.
ఎగసిన వెండి ధరలు! ఎంతంటే.. పెరిగిన.. వెండి ధరలు.. ఒకవైపు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. వెండి ధరలు కేజీకి 300 పెరిగింది. దీంతో వెండి ధరలు కేజీకి 49,300 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,540 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,980 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,300 రూపాయలకు చేరింది.
దేశరాజధాని ఢిల్లీలోనూ.. ఇక ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 39,880 రూపాయలకు చేరింది. వెండి ధర కేజీకి 49,300 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు11.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.
https://www.hmtvlive.com/business/gold-rate-today-10-02-2020-silver-rate-gold-rate-hyderabad-delhi-vijayawada-amaravathi-39350




