Gold Rate: పైకెగసిన బంగారం..వెండిధరలు కూడా పైకే!

K V D Varma
Updated on: 10 April 2020 11:36 AM IST
Gold Rate: పైకెగసిన బంగారం..వెండిధరలు కూడా పైకే!
X
gold rate today (representational image)

నిన్న కిందికి కదిలిన బంగారం ధరలు ఈరోజు కాస్త పైకెగాశాయి.. ఈరోజు (ఏప్రిల్ 10) బంగారం ధరలు పది గ్రాములకు 110 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కూడా కేజీకి 40 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు పెరుగుదలదల నమోదు చేశాయి. శుక్రవారం (10.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,140 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో 43,900 రూపాయలు నమోదు చేసింది.

కొద్దిగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 40 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు కంటే కిందికి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,990 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,140 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో 43,900 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 40,990 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయల తగ్గుదలతో 44,250 రూపాయల వద్ద నిలిచింది. అయితే, ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం1 10 రూపాయల పెరుగుదలతో 42,280 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాదకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,990 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story