స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. వెండి ధరల్లో భారీ తగ్గుదల!
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న స్థిరంగా నిలిచాయి. ఈరోజు స్వల్పంగా కిందకు దిగొచ్చాయి. పది గ్రాముల బంగారం వంద రూపాయల తగ్గుదల నమోదు చేశాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (10.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 100 రూపాయల తగ్గుదల నమోదు చేసి 41,980 రూపాయలుగా నిచింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో 45,800 రూపాయలు నమోదు చేసింది.
స్థిరంగా వెండి ధరలు...
గత వారం పైకెగసిన వెండి ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. దీంతో 50 వేల మార్కునుంచి దిగొచ్చిన కేజీ వెండి ధర 49,500 రూపాయలుగా నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నం లలో..
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 100 రూపాయల తగ్గుదల నమోదు చేసి 41,980 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు100 రూపాయల తగ్గుదలతో 45,800 రూపాయలు నమోదు చేసింది. అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా తగ్గడంతో కేజీకి 49,500 రూపాయలుగా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయల తగ్గుదల నమోదు చేసి 44,050 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయలు తగ్గింది. దీంతో 44,050 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా భారీగా తగ్గుదల నమోదు చేసి 49,500 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




