స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరలూ అదే దారిలో!
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. పోయిన వారంలో విపరీతంగా పెరిగి, రికార్డ్ ధరలను నమోదు చేసిన బంగారం, వెండి ధరలు స్థిరంగా నిలిచాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు ఎటువంటి మార్పులూ లేకుండా నిలిచాయి. సోమవారం (09.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే పది రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,080 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు పది రూపాయల పెరుగుదలతో 45,900 రూపాయలు నమోదు చేసింది.
స్థిరంగా వెండి ధరలు...
గత వారం పైకెగసిన వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర 51,080 రూపాయలుగా నిలిచింది.
విజయవాడ, విశాఖపట్నం లలో..
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే పది రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,080 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు పది రూపాయల పెరుగుదలతో 45,900 రూపాయలు నమోదు చేసింది. అదేవిధంగా వెండి ధరలు కూడా స్థిరంగా కేజీకి 51,080 రూపాయలుగా మార్పులు లేకుండా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,160 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 42,960 రూపాయల వద్ద ఆగుబ్డు. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా మార్పులు లేకుండా 51,080 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




