Gold Rate: స్వల్ప మార్పులతో బంగారం, వెండి ధరలు..ఈరోజు ధరలివే!

Gold Rate: బంగారం ధరలు కొద్దిపాటి మార్పులతో స్థిరంగా ఉన్నాయి. వెండి స్వల్ప పెరుగుదల నమోదు చేసింది

K V D Varma
Published on: 7 Sept 2020 8:12 AM IST
Gold Rate: స్వల్ప మార్పులతో బంగారం, వెండి ధరలు..ఈరోజు ధరలివే!
X

Gold Rate Today

తక్కువ స్థాయిలో బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 07) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. సోమవారం (07.09.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 30 రూపాయలు పెరిగి 48,890 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 30 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,320 రూపాయల వద్దకు చేరింది.

స్వల్పంగా పెరిగిన వెండి ధరలు..

బంగారం ధరలు పెరుగుదల చూపిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 160 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,210 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 30 రూపాయలు పెరిగి 48,890 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 30 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,320 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు నిలకడగా నిలిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ధర వద్దే స్థిరంగా ఉంది. దీంతో 49,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ధర వద్ద ఎటువంటి మార్పులు లేకుండా నిలిచింది. దాంతో 54,110 రూపాయల వద్దే కొనసాగుతోంది. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 160 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,210 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story