Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. ఎగసిన వెండి ధరలు! ఈరోజు ఎంతంటే..

Gold Rate: నిన్న కొద్దిగా తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

K V D Varma
Published on: 5 Sept 2020 7:29 AM IST
Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. ఎగసిన వెండి ధరలు! ఈరోజు ఎంతంటే..
X

Gold rate today

రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 05) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. శనివారం (05.09.2020) బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 90 రూపాయలు పెరిగి 48,860 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 90 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,290 రూపాయల వద్దకు చేరింది.

వెండి ధరలు పైపైకి..

బంగారం ధరలు పెరుగుదల చూపిస్తే, వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 1400 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,050 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 90 రూపాయలు పెరిగి 48,860 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 90 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,290 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు నిలకడగా నిలిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ధర వద్దే స్థిరంగా ఉంది. దీంతో 49,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ధర వద్ద ఎటువంటి మార్పులు లేకుండా నిలిచింది. దాంతో 54,110 రూపాయల వద్దే కొనసాగుతోంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 90 రూపాయలు పెరిగి 48,860 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 90 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,290 రూపాయల వద్దకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story