Gold rate: పైకీ..కిందికీ.. గత వారం అంతా బంగారం, వెండి ధరల దోబూచులాట!

Gold Rate: వారాంతానికి బంగారం ధరలు కాస్త దిగిరాగా, వెండి ధరలు కాస్త పైకేగాశాయి. ఆ వారంలో బంగారం, వెండి ధరల కదలికలు ఇలా ఉన్నాయి
బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎంత తగ్గింది.. ఎంత పెరిగింది చూడడం సహజం..పదుల రూపాయల్లో పెరిగినా తరిగినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. కానీ, బంగారం విషయంలో మాత్రం రూపాయి తగ్గినా..రూపాయి పెరిగినా అది పెద్ద విషయంలానే లేక్కేస్తారు.
ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.
ఇక గత సోమవారం(ఆగస్టు 31) నుంచి శనివారం(సెప్టెంబర్ 05) వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.
పసిడి కాస్త కిందికి..
గత వారంలో (ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 05 వరకు) బంగారం ధరలు రెండు రోజులు పైకి..రెండు రోజులు కిందికి అన్నట్టుగా మారుతూ వచ్చాయి. వారం అంతా అటూ ఇటూ అయిన పసిడి ధరలు వారాంతానికి స్వల్ప పెరుగుదలతోనే ముగిశాయి. మొత్తమ్మీద చూసుకుంటే గత వారం కంటె ఈ వారాంతానికి తగ్గుదల బాటలోనే నడిచాయి.
అయితే, గత వారంతంలో ప్రారంభమైన పసిడి ధరల కింది చూపులు ఈ వారం ప్రారంభంలో పైకి ఎగశాయి. ఆగస్టు 31 వతేదీ సోమవారం పది గ్రాములకు 410 రూపాయలు ఎగసిన బంగారం ధరలు తరువాతి రోజూ అంటే మంగళవారం (సెప్టెంబర్ 01) కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (సెప్టెంబర్ 02) తరువాతి రోజు (సెప్టెంబర్ ౦౩) రెండురోజులూ కలిపి 950 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. ఇక అటు తరువాత రెండురోజులూ వరుసగా స్వల్పంగా పెరుగుతూ వచ్చింది. చివరకు శనివారం సెప్టెంబర్ 05న 20 రూపాయల స్వల్ప పెరుగుదలతో వారాన్ని ముగించింది పసిడి. వారం మొత్తంగా చూసుకుంటే సోమవారం(31 ఆగస్టు) 22 కారెట్ల బంగారం పది గ్రాములకు 49,130 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(సెప్టెంబర్ 05) సాయంత్రం 48,880 రూపాయల వద్ద ముగిశాయి. అంటే దాదాపు 250 రూపాయల స్వల్ప తగ్గుదల కనబరిచింది. ఇక 24 కారెట్ల బంగారం సోమవారం(31 ఆగస్టు)న పది గ్రాములకు 53,590 రూపాయల వద్ద మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. శనివారం(సెప్టెంబర్ 05) సాయంత్రం 53,310 రూపాయల వద్ద ముగిశాయి. అంటే వారం మొత్తం చూసుకుంటే బంగారం దాదాపు 280 రూపాయల స్వల్పతగ్గుదల కనబరిచింది.
ఇక ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం.. అంతర్జాతీయంగా ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో పసిడి కాస్త నిదానించినట్టు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వెండి ధరలు కాస్త ఎగిశాయి..!
ఇక దేశీయంగా వెండి ధరలు కూడా కిందికీ మీదికి కదులుతూ వచ్చాయి. స్థిరం లేకుండా పెరిగినపుడు అమాంతం పెరగడం తగ్గినపుడూ అదే మాదిరిగా కిందికి పడిపోవడం జరుగుతూ వచ్చింది. వారం పొడవునా వెండి ధరలు అటూ ఇటూ కదిలాయి. వారం ప్రారంభంలో సోమవారం(ఆగస్టు 31) కేజీ వెండి 66,600 రూపాయల వద్ద ప్రారంభం అయింది. ఆ రోజు కేజే వెండి ధర ఒక్కసారిగా 2,100 రూపాయలు పైకెగసింది... అటు తరువాతి రోజు అంటే మంగళవారం(సెప్టెంబర్ 01) ఒక్కసారిగా 1500 రూపాయల తగ్గుదల చూపించింది. మర్నాడు (సెప్టెంబర్ 02) కూడా అదే స్థాయిలో 1600 రూపాయలు దిగివచ్చింది. మళ్ళీ సెప్టెంబర్ 4 వతేదీ శుక్రవారం ఒక్కసారిగా 1450 రూపాయలు పైకెగసింది. ఇలా వారం అంతా నిలకడ లేకుండా వెండి ధరలు భారీ మార్పులకు గురవుతూ వచ్చాయి. మొత్తమ్మీద వారాంతానికి 600 రూపాయలు పెరిగి 67,200 రూపాయల వద్ద నిలిచింది.
ఇక శుభముహూర్తాలు కూడా ఏమీ లేకపోవడంతో వచ్చే వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చనీ.. కొద్దిపాటి తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉందనీ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!
Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
రద్దీ దృష్ట్యా ఆ ఐదురోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. భక్తులకు...
9 Aug 2022 2:00 PM GMTఎంపీ గోరంట్ల వీడియోపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
9 Aug 2022 1:30 PM GMTVishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMT