Gold Rate: పరుగు ఆపని బంగారం ధరలు..ఏమాత్రం తగ్గని వెండి ధరలు!

Gold Rate: బంగారం ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. మరోవైపు వెండి ధరలు ఈరోజు మళ్ళి భారీ పెరుగుదల కనబర్చాయి.

K V D Varma
Updated on: 7 Aug 2020 8:44 AM IST
gold rate today silver rate today all time high
X
Gold rate today

బంగారం ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. మరోవైపు వెండి ధరలు ఈరోజు మళ్ళి భారీ పెరుగుదల కనబర్చాయి.. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్ళీపెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 07) దేశీయంగా పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు తగ్గుదల కనబర్చాయి.నిన్నటిలానే భారీ జంప్ చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మరికాస్త పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (07.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 500 రూపాయలు పెరిగింది. దీంతో 53,510 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 500 రూపాయలు పెరిగింది. దీంతో 58 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 58,320 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు మరింత దూసుకుపోయాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 2000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 73వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 73,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 500 రూపాయలు పెరిగింది. దీంతో 53,510 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 500 రూపాయలు పెరిగింది. దీంతో 58 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 58,320 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 650 రూపాయలు పెరిగి 54,150 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం ధరతో పోలిస్తే 650 రూపాయలు పెరిగింది. దీంతో 55,350 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా గురువారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 2000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 73వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 73,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story