మళ్ళీ పెరిగిన బంగారం.. వెండి భారీ షాక్!

K V D Varma
Published on: 7 May 2020 7:52 AM IST
మళ్ళీ పెరిగిన బంగారం.. వెండి భారీ షాక్!
X

నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజూ పెరుగుదల కనబరిచాయి. ఈరోజు (మే 7) బంగారం ధరలు దేశీయంగా పెరుగుదలకదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజూ భారీ పెరుగుదల నమోదు చేశాయి.

బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (07.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 240 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,140 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 300 రూపాయల పెరుగుదలతో 46,900 రూపాయలు నమోదు చేసింది.

భారీగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం భారీ పెరుగుదల నమోదు చేశాయి. కేజీకి 700 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 42,000 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 240 రూపాయల పెరుగుదల నమోదు చేసి 44,140 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 300 రూపాయల పెరుగుదలతో 46,900 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,300 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 46,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయల పెరుగుదలతో 44,700 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 42,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story