Top
logo

Gold Rate: నిలకడగా బంగారం ధరలు..మార్పులు లేని వెండి!

Gold Rate: నిలకడగా బంగారం ధరలు..మార్పులు లేని వెండి!
Highlights

కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు (ఏప్రిల్ 7) బంగారం ధరలు పది గ్రాములకు...

కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు (ఏప్రిల్ 7) బంగారం ధరలు పది గ్రాములకు ఎటువంటి మార్పులూ లేకుండా నిలిచాయి. మరో వైపు వెండి ధరలు కూడా కదలిక లేకుండా ఉన్నాయి.

బంగారం ధరలు ఐదురోజుల తరువాత తమ పరుగులు ఆపాయి. మంగళవారం (06.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర వద్దే నిలకడగా 40,030 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్తిర్మగా నిన్నటి ధర 43,030 రూపాయలు నమోదు చేసింది.

నిలకడగా వెండి ధరలు...

బంగారం ధరల తో పాటూ, వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. వెండి ధర ఎటువంటి మార్పులకూ లోనుకాకుండా కేజీ కి 40,360 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర 40,030 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధరే 44,030 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కదలిక లేకుండా 40,360 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఇదేవిధంగా కదలిక లేకుండా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,260 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 41,960 రూపాయలవద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి ధరలు ఇక్కడ నిలకడగా ఉన్నాయి. కేజీ వెండి ధర 40,360 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Web Titlegold-rate-today-07-04-2020-silver-rate-gold-rate-hyderabad-delhi-vijayawada-amaravathi
Next Story