Gold Rate Today: నాలుగోరోజు తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి ధరలు!

K V D Varma
Updated on: 7 Feb 2020 10:07 AM IST
Gold Rate Today: నాలుగోరోజు తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి ధరలు!
X

వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ నెల ప్రారంభంలో వరుసగా పెరుగుదల నమోదు చేసి కంగారు పుట్టించిన పసిడి ఈ మధ్య కింది చూపులు చూస్తూ వస్తోంది. అదేవరుసలో ఈరోజు కూడా బంగారం కింది దిగింది. నిన్నటి ధరల కంటే ఈరోజు (07.02.2020) మరింత బంగారం ధర తగ్గింది.

వరుసగా నాలుగో రోజూ దిగివచ్చిన బంగారం..

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 100 రూపాయలు తగ్గింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 41,980 నుంచి 41,880 రూపాయలకు తగ్గింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 100 రూపాయలు తగ్గడంతో 38,480 నుంచి 38,380 రూపాయల వద్దకు చేరుకుంది.

నిలకడగా వెండి ధరలు..

ఒకవైపు బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేయగా, వెండి ధరలు స్థిరంగా నిలిచాయి. వెండి ధరలు కేజీకి నిన్నటి ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. దీంతో వెండి ధరలు కేజీకి 48,000 రూపాయల వద్దనిలిచాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,980 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,480 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 48,000 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 100 రూపాయలుతగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,400 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,200 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా తగ్గింది.. దాంతో వెండి ధర కేజీకి 48,000 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


K V D Varma

K V D Varma

Next Story