Gold Rate:వామ్మో.. బంగారం..ఒక్కసారే కొండెక్కిన వెండి.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు !

Gold Rate: బంగారం ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. మరోవైపు వెండి ధరలు ఈరోజు రికార్డు స్థాయిలో పెరిగాయి.

K V D Varma
Updated on: 6 Aug 2020 6:00 AM IST
gold rate today silver rate today all time high
X
Gold rate today

బంగారం ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. మరోవైపు వెండి ధరలు ఈరోజు రికార్డు స్థాయిలో పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 06) దేశీయంగా పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు భగ్గున ఎగశాయి. ఎన్నడూ లేని విధంగా ఏకంగా కేజేకి ఆరువేల రూపాయలకు పైగా పైకి ఎగశాయి! వెండి ధరల పెరుగుదలలో ఇది అల్ టైం హై రికార్డు!.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మళ్ళీ భారీ పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (06.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 930 రూపాయలు పెరిగింది. దీంతో 53,010 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 1010 రూపాయలు పెరిగింది. దీంతో 57 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 57,820 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు అల్ టైం రికార్డ్!

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు ఏకంగా 6450 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 71 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 71,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 930 రూపాయలు పెరిగింది. దీంతో 53,010 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 1010 రూపాయలు పెరిగింది. దీంతో 57 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 57,820 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం ధరతో పోలిస్తే 950 రూపాయలు పెరిగి 53,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం ధరతో పోలిస్తే 950 రూపాయలు పెరిగింది. దీంతో 54,700 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడాబుధవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు ఏకంగా 6450 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 71 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్ద వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 71,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story