Gold Rate:ఎక్కడా తగ్గని బంగారం ధరలు..కాస్త నిదానించిన వెండి ధరలు!

Gold Rate: బంగారం ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. మరోవైపు వెండి ధరలు ఈరోజు కాస్త దిగివచ్చాయి.

K V D Varma
Published on: 5 Aug 2020 7:31 AM IST
Gold Rate:ఎక్కడా తగ్గని బంగారం ధరలు..కాస్త నిదానించిన వెండి ధరలు!
X
gold rate today

బంగారం ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. మరోవైపు వెండి ధరలు ఈరోజు కాస్త దిగివచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్ళీపెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 05) దేశీయంగా పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు తగ్గుదల కనబర్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మరికాస్త పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (01.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగింది. దీంతో 52,080 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 220 రూపాయలు పెరిగింది. దీంతో 55 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 56,810 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు తగ్గాయి..

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు కాస్త తగ్గాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే కొద్దిగా తగ్గాయి. ఈరోజు 350 రూపాయల తరుగుదల నమోదు చేసింది. దీంతో 65 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్దే వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 65,050 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగింది. దీంతో 52,080 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 220 రూపాయలు పెరిగింది. దీంతో 55 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 56,810 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 100 రూపాయలు పెరిగి 52,550 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం ధరతో పోలిస్తే 100 రూపాయలు పెరిగింది. దీంతో 53,75 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా ఈరోజు 350 రూపాయల తరుగుదల నమోదు చేసింది. దీంతో 65 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్దే వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 65,050 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story