అక్కడో రకంగా..ఇక్కడో రకంగా దేశంలో బంగారం ధరల కదలిక! ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..

అక్కడో రకంగా..ఇక్కడో రకంగా దేశంలో బంగారం ధరల కదలిక! ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..
x
Highlights

దేశంలో బంగారం ధరలు అక్కడో రకంగా.. ఇక్కడో రకంగా కదులుతూ వస్తున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ లో ఈరోజూ కాస్త పెరుగుదల కనబరిచాయి....

దేశంలో బంగారం ధరలు అక్కడో రకంగా.. ఇక్కడో రకంగా కదులుతూ వస్తున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ లో ఈరోజూ కాస్త పెరుగుదల కనబరిచాయి. అయితే, ఢిల్లీ మార్కెట్లో మాత్రం నిన్నటిలానే తగ్గుదల కనబర్చాయి. ఈరోజు (మే 6) బంగారం ధరలు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజూ కాస్త తగ్గుదల నమోదు చేశాయి.

బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (06.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 43,900 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 50 రూపాయల పెరుగుదలతో 46,600 రూపాయలు నమోదు చేసింది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కేజీకి 200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,300 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 43,900 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 50 రూపాయల పెరుగుదలతో 46,600 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,300 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలోమాత్రం బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50 రూపాయలు తగ్గి 46,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయల తగ్గుదలతో 44,500 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 41 వేల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 41,300 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories