Gold rate Today: కాస్త తగ్గిన బంగారం..వెండి ధరలు దిగొచ్చాయి!
నిన్న ఒక్కసారే రివ్వున దూసుకుపోయిన బంగారం ధరలు కాస్త కిందికి దిగొచ్చాయి. వెండి ధరలు కూడా అదే దారిలో తగ్గుదల నమోదు చేశాయి.
వరుసగా నాలుగురోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు అదే దారిలో దిగొచ్చాయి. దేశీయంగా ఈరోజు (06.03.2020) బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు కాస్త నెమ్మదించాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 170 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 43,310 రూపాయల నుంచి 45,140 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో తగ్గుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 170 రూపాయలు తగ్గింది. దీంతో 40,530 రూపాయల నుంచి 41,360 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర దిగొచ్చింది.
స్వల్పంగా తగ్గిన వెండి !
బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. దీంతో శుక్రవారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 180 రూపాయలు తగ్గి 50,030రూపాయల నుంచి 49,850 రూపాయలకు చేరుకుంది.
విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...
ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 45,140 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 41,360 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 180 రూపాయలు తగ్గాయి. దీంతో కెజీ వెండి 49,850 రూపాయల వద్దకు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా కాస్త తగ్గాయి.దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 43,450 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 42,250 రూపాయల వద్దకు దిగింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా కొద్దిగా తగ్గి 49,850 రూపాయలకు చేరుకుంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




