Gold Rate Today: మూడోరోజూ దిగివచ్చిన బంగారం.. వెండి ధరలూ తగ్గుతున్నాయి..

K V D Varma
Updated on: 6 Feb 2020 10:51 AM IST
Gold Rate Today: మూడోరోజూ దిగివచ్చిన బంగారం.. వెండి ధరలూ తగ్గుతున్నాయి..
X

వరుసగా మూడో రోజూ బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ నెల ప్రారంభంలో వరుసగా పెరుగుదల నమోదు చేసి కంగారు పుట్టించిన పసిడి ఈ మధ్య కింది చూపులు చూస్తూ వస్తోంది. అదేవరుసలో ఈరోజు కూడా బంగారం కింది దిగింది. నిన్నటి ధరల కంటే ఈరోజు (06.02.2020) మరింత బంగారం ధర తగ్గింది.

వరుసగా మూడో రోజూ దిగివచ్చిన బంగారం..

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 470 రూపాయలు తగ్గింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,450 నుంచి 41,980 రూపాయలకు తగ్గింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 290 రూపాయలు తగ్గడంతో 38,770 నుంచి 38,480 రూపాయల వద్దకు చేరుకుంది.

భారీగా పడిపోయిన వెండి ధరలు.. ఒకవైపు బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేయగా, వెండి ధరలు రెండోరోజూ భారీగా పతనమయ్యాయి. వెండి ధరలు కేజీకి 500 రూపాయలు దిగొచ్చాయి. దీంతో వెండి ధరలు కేజీకి 48,000 రూపాయల వద్దనిలిచాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,980 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,480 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 48,000 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 300 రూపాయలుతగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,500 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,300 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా తగ్గింది.. దాంతో వెండి ధర కేజీకి 48,000 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


K V D Varma

K V D Varma

Next Story