మళ్ళీ తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలూ అదే దారిలో!

మళ్ళీ తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలూ అదే దారిలో!
x
Highlights

బంగారం ధరలు వరుసగా మూడోరోజు మళ్ళీ తగ్గాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 05) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. ...

బంగారం ధరలు వరుసగా మూడోరోజు మళ్ళీ తగ్గాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 05) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (05.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 120 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 44,560 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 140 రూపాయలు తగ్గింది. దీంతో 48,640 రూపాయలకు చేరింది.

తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు కొద్దిగా తగ్గితే, వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రికార్డు మార్కు నుంచి కిందికి దిగి వచ్చింది. కేజీ వెండి ధర 48,500 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 120 రూపాయలు తగ్గుదల నమోదు చేసి, 44,560 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 140 రూపాయల తగ్గుదల నమోదు చేసి 48,640 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,500 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు కిందికి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 46,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 45,300 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 50 వేల రికార్డు మార్కు నుంచి కిందికి దిగి వచ్చి 48,500 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories