బంగారం అక్కడ తగ్గింది..ఇక్కడ పెరిగింది! పైకెగసిన వెండి ధరలు!

బంగారం అక్కడ తగ్గింది..ఇక్కడ పెరిగింది! పైకెగసిన వెండి ధరలు!
x
Highlights

నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ లో ఈరోజూ కాస్త పెరుగుదల కనబరిచాయి.అయితే, ఢిల్లీ మార్కెట్లో మాత్రం తగ్గుదల కనబర్చాయి. ఈరోజు (మే 5) బంగారం ధరలు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజూ కాస్త పెరుగుదల నమోదు చేశాయి.

నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ లో ఈరోజూ కాస్త పెరుగుదల కనబరిచాయి.అయితే, ఢిల్లీ మార్కెట్లో మాత్రం తగ్గుదల కనబర్చాయి. ఈరోజు (మే 5) బంగారం ధరలు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజూ కాస్త పెరుగుదల నమోదు చేశాయి.

బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (05.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 43,750 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 150 రూపాయల పెరుగుదలతో 46,550 రూపాయలు నమోదు చేసింది.

స్వల్పంగా పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా అదే దారిలో స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. కేజీకి 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,500 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం ధర కంటే 150 రూపాయల పెరుగుదల నమోదు చేసి 43,750 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 150 రూపాయల పెరుగుదలతో 46,550 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,500 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలోమాత్రం బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 రూపాయలు తగ్గి 46,300 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 700 రూపాయల తగ్గుదలతో 44,560 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 41 వేల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 41,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories