బంగారం ధరలు దిగివచ్చాయి..వెండి ధరలు భారీగా తగ్గాయి!

బంగారం ధరలు దిగివచ్చాయి..వెండి ధరలు భారీగా తగ్గాయి!
x
Highlights

బంగారం ధరల పరుగులు ఆగాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 04) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం...

బంగారం ధరల పరుగులు ఆగాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 04) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (04.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 390 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 44,680 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 390 రూపాయలు తగ్గింది. దీంతో 48,780 రూపాయలకు చేరింది.

భారీగా తగ్గిన వెండి ధరలు..

బంగారం ధరలు కొద్దిగా తగ్గితే, వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే 1260 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రికార్డు మార్కు నుంచి కిందికి దిగి వచ్చింది. కేజీ వెండి ధర 48,900 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 390 రూపాయలు తగ్గుదల నమోదు చేసి, 44,680 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 390 రూపాయల తగ్గుదల నమోదు చేసి 48,780 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీ తగ్గుదాల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,900 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు కిందికి కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయలు తగ్గి 46,650 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 500 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 45,450 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1260 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 50 వేల రికార్డు మార్కు నుంచి కిందికి దిగి వచ్చి 48,900 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories