స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..అదే దారిలో వెండి!
గత వారాంతంలో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభంలో పెరుగుదల కనబరిచాయి. ఈరోజు (మే 4) బంగారం ధరలు దేశీయంగా కాస్త పైకెగాశాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు కాస్త పెరుగుదల నమోదు చేశాయి.
బంగారం ధరలు ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (04.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 190 రూపాయల పెరుగుదల నమోదు చేసి 43,600 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 200 రూపాయల పెరుగుదలతో 46,400 రూపాయలు నమోదు చేసింది.
స్వల్పంగా పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా అదే దారిలో స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. కేజీకి 200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,200 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం ధర కంటే 190 రూపాయల పెరుగుదల నమోదు చేసి 43,600 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 200 రూపాయల పెరుగుదలతో 46,400 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,200 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలోమాత్రం బంగారం ధరలు నిలకడ కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్పులు లేకుండా 47,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా నిలిచి 45,250 రూపాయలవద్దే నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 41 వేల మార్కు వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 41,200 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




