స్వల్పంగా పెరిగిన బంగారం..వెండి ధరలు కిందికి..!

K V D Varma
Published on: 4 March 2020 6:32 AM IST
స్వల్పంగా పెరిగిన బంగారం..వెండి ధరలు కిందికి..!
X

బంగారం ధరలు మళ్ళీ పై చూపులు చూశాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు కొద్ది మేర పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. దేశీయంగా ఈరోజు బంగారం ధర పైకెగసింది. రెండవ రోజూ స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 10 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 43,780 రూపాయల నుంచి 43,790 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 160 రూపాయలు పెరిగింది. దీంతో 39,980 రూపాయల నుంచి 40,140 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పైకెగసింది.

కాస్త తగ్గిన వెండి!

బంగారం ధర పెరిగితే వెండి ధరలు కూడా తగ్గుదల మోదు చేశాయి. దీంతో బుధవారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 50 రూపాయలు తగ్గి 48,750 రూపాయల నుంచి 48,700 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 43,380 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 40,140 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 50 రూపాయలు తగ్గింది. దీంతో కెజీ వెండి 48,700 రూపాయల వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,200 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసి 41,000 రూపాయల వద్దకు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా తగ్గింది. దీంతో కేజీ వెండి 48,700 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story