Gold Rate: శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. పడిపోయిన వెండి ధరలు!

Gold Rate: రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజుకొంత మేర తగ్గాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి.

K V D Varma
Published on: 3 Sept 2020 7:02 AM IST
Gold Rate: శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. పడిపోయిన వెండి ధరలు!
X

Gold rate today

వరుసగా రెండు రోజులు పైకెగసిన బంగారం ధరలు ఈరోజు కాస్త శాంతించాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 03) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీస్థాయిలో పతనం అయ్యాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. గురువారం (03.09.2020) బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 560 రూపాయలు తగ్గి 49,160 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 570 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 54,200 రూపాయల వద్దకు చేరింది.

వెండి ధరలు ఢమాల్!

బంగారం ధరలు తగ్గుదల చూపిస్తే, వెండి ధరలు అమాంతం కిందికి దిగివచ్చాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే ఒక్కసారిగా భారీ తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 2900 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 65,800 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 560 రూపాయలు తగ్గి 49,160 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 570 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 54,200 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త కిందికి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ధర కంటె 400 రూపాయలు తగ్గింది. దీంతో 50,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ధర కంటె 400 రూపాయలు తగ్గింది. దాంతో 54,600 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే ఒక్కసారిగా భారీ తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 2900 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 65,800 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story