Gold Rate: కొద్దిగా పెరిగిన బంగారం ధరలు.. భారీ మోత మోగించిన వెండి ధరలు!

Gold Rate: కొద్దిగా పెరిగిన బంగారం ధరలు.. భారీ మోత మోగించిన వెండి ధరలు!
x
Highlights

Gold Rate: నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

వరుసగా రెండోరోజూ బంగారం ధరలు పైకి ఎగశాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 02) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీస్థాయిలో పైకెగసి షాకిచ్చాయి..

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. బుధవారం (02.09.2020) బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 180 రూపాయలు పెరిగి 49,720 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 160 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 54,200 రూపాయల వద్దకు చేరింది.

వెండి ధరలు పైపైకి..

బంగారం ధరలు పెరుగుదల చూపిస్తే, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 2100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయి దాటి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,710 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 180 రూపాయలు పెరిగి 49,720 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 160 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 54,200 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త పైకి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ధర కంటె 50 రూపాయలు పెరిగింది. దీంతో 50,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ధర కంటె 70 రూపాయలు పెరిగింది. దాంతో 55,000 రూపాయలకు ఎగసింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 2100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయి దాటి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,710 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories