Gold Rate: పైకెగసిన బంగారం ధరలు.. వెండి ధరలు అదే బాటలో!

Gold Rate: ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. మరోవైపు వెండి ధరలూ పెరుగుదల నమోదు చేశాయి.

K V D Varma
Updated on: 2 Sept 2020 8:33 AM IST
Gold Rate: పైకెగసిన బంగారం ధరలు.. వెండి ధరలు అదే బాటలో!
X

Gold Rate today

ఇటీవల తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు కాస్త పైకెగశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 01) దేశీయంగా పెరుగుదల కనపరిచాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ పైకెగశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. మంగళవారం (01.09.2020) బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 410 రూపాయలు పెరిగి 49,540 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 450 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 54,040 రూపాయల వద్దకు చేరింది.

వెండి ధరలు పైపైకి..

బంగారం ధరలు పెరుగుదల చూపిస్తే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 240 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయి దాటి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,600 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 410 రూపాయలు పెరిగి 49,540 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 450 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 54,040 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త పైకి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ధర కంటె 340 రూపాయలు పెరిగింది. దీంతో 50,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ధర కంటె 380 రూపాయలు పెరిగింది. దాంతో 54,930 రూపాయలకు ఎగసింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 240 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయి దాటి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,600 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story