Gold Rate: బంగారం ధరల మోత! వెండి ధరల వాత!

Gold Rate:బంగారం పదకొండు రోజులుగా భగ్గుమంటూనే ఉంది. మరోవైపు వెండి ఈరోజు పరుగులు తీసింది.

K V D Varma
Published on: 3 Aug 2020 7:33 AM IST
Gold and silver rate today 01 st august
X
Gold rate today

బంగారం పదకొండు రోజులుగా భగ్గుమంటూనే ఉంది. మరోవైపు వెండి ఈరోజు పరుగులు తీసింది. హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్ట్ 03) దేశీయంగా భారీ పెరుగుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (03.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 530 రూపాయలు పెరిగింది. దీంతో 51,780 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 670 రూపాయలు పెరిగింది. దీంతో 54 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 54,300 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే కొద్దిగాపెరిగింది. ఈరోజు 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 65 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 65,110 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 530 రూపాయలు పెరిగింది. దీంతో 51,780 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 670 రూపాయలు పెరిగింది. దీంతో 54 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 54,300 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం ధరతో పోలిస్తే 50 రూపాయలు పెరిగి 52,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం ధరతో పోలిస్తే 250 రూపాయలు పెరిగింది. దీంతో 53,450 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే కొద్దిగాపెరిగింది. ఈరోజు 50 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 65 వేల రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 65,110 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story