బంగారం పరుగుకు స్వల్ప బ్రేక్! పెరిగిన వెండి ధరలు!!

బంగారం పరుగుకు స్వల్ప బ్రేక్! పెరిగిన వెండి ధరలు!!
x
Highlights

బంగారం ధరల పరుగులకు చిన్న బ్రేక్ పడింది. బంగారంధరలు ఈరోజు (జూన్ 03) దేశీయంగా కాస్త కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

బంగారం ధరల పరుగులకు చిన్న బ్రేక్ పడింది. బంగారంధరలు ఈరోజు (జూన్ 03) దేశీయంగా కాస్త కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (03.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 50 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,070 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 150 రూపాయలు తగ్గింది. దీంతో 49,170 రూపాయలకు చేరింది.

కాస్త పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలు కొద్దిగా తగ్గితే, వెండి ధరలు కాస్త పెరిగాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 10 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రికార్డు మార్కు దాటింది. కేజీ వెండి ధర 50,160 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 50 రూపాయలు తగ్గుదల నమోదు చేసి, 45,070 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 50 రూపాయల తగ్గుదల నమోదు చేసి 49,170 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 50,150 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు మిశ్రమంగా కదిలాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550 రూపాయలు తగ్గి 47,150 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 50 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 45,950 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 10 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 50 వేల రికార్డు మార్కు దాటి 50,160 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories