Gold Rate: పైకెగసిన బంగారం ధరలు.. వెండి ధరలూ అదే బాటలో!

K V D Varma
Published on: 3 April 2020 7:49 AM IST
Gold Rate: పైకెగసిన బంగారం ధరలు.. వెండి ధరలూ అదే బాటలో!
X

వారం ప్రారంభం నుంచీ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు (ఏప్రిల్ 3) బంగారం ధరలు పది గ్రాములకు 290 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కేజీకి 220 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

బంగారం ధరలు నాలుగురోజుల తరువాత పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (03.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 290 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,730 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 190 రూపాయల పెరుగుదలతో 43,270 రూపాయలు నమోదు చేసింది.

పెరుగుదల నమోదు చేసిన వెండి ధరలు...

బంగారం ధరల తో పాటూ, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 220 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,160 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 290 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,730 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 190 రూపాయల తగ్గుదలతో 43,270 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా పెరిగాయి. వెండి ధర 40,160 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 260 రూపాయల పెరుగుదలతో 43,470 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 240 రూపాయల పెరుగుదలతో 41,180 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 40 వేల మార్కు దాటి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,160 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story