బంగారం ధరలు పెరిగాయి.. వెండి కూడా అదే దారిలో.. ఈరోజు ధరలు ఇలా..
వరుసగా రెండు రోజుల పాటు భారీ పతనాన్ని చూసిన బంగారం ధరలు మళ్ళీ పై చూపులు చూశాయి. వరుస పతనానికి బ్రేకులు వేస్తూ.. ఈరోజు బంగారం ధరలు కొద్ది మేర పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. భారీ తగ్గుదల నుంచి స్వల్ప పెరుగుదల వైపు అడుగులు వేశాయి.
దేశీయంగా ఈరోజు బంగారం ధర పైకెగసింది. రెండు రోజుల తరువాత ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 43,670 రూపాయల నుంచి 43,780 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగింది. దీంతో 39,870 రూపాయల నుంచి 39,980 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పైకెగసింది.
పైచూపులు చూసిన వెండి!
బంగారం ధర తో పాటు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో మంగళవారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 250 రూపాయలు పెరిగి 48,500 రూపాయల నుంచి 48,750 రూపాయలకు చేరుకుంది.
విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...
ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 43,360 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,860 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 1,070 రూపాయలు తగ్గింది. దీంతో కెజీ వెండి 48,500 రూపాయల వద్దకు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో..
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,000 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసి 40,800 రూపాయల వద్దకు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరిగింది. దీంతో కేజీ వెండి 48,750 రూపాయలకు చేరుకుంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




