స్వల్పంగా పెరిగిన బంగారం..నిలకడగా వెండి!

K V D Varma
Updated on: 3 Feb 2020 7:58 AM IST
స్వల్పంగా పెరిగిన బంగారం..నిలకడగా వెండి!
X

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగుదల నమోదు చేశాయి. నిన్న ఆదివారం కావడంతోట్రేడింగ్ జరగకపోవడంతో పెద్దగా బంగారం ధరల్లో మార్పు రాలేదు. నిన్నటి ధరల కంటే ఈరోజు (03.02.2020) స్వల్పంగా బంగారం ధర పెరిగింది.

స్వల్పంగా పెరిగిన బంగారం..

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా ఎగశాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 10 రూపాయలు పెరిగింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,750 నుంచి 42,760 రూపాయలకు పెరిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 10 రూపాయలు పెరగడంతో 39,220 నుంచి 39,230 రూపాయల వద్దకు చేరుకుంది.

నిలకడగా వెండి ధరలు..

ఒకవైపు బంగారం ధరలు అటూ ఇటూ మారుతూ వస్తున్నా.. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. దీంతో వెండి ధరలు కేజీకి 49,990 రూపాయల వద్దనిలిచాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,760 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,230 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,990 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 10 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,210 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,060 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా నిలకడగా ఉంది.. దాంతో వెండి ధర కేజీకి 49,990 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 03.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


K V D Varma

K V D Varma

Next Story