ఆగని బంగారం పరుగు..వెండి ధరలు పెరిగాయి!

ఆగని బంగారం పరుగు..వెండి ధరలు పెరిగాయి!
x
Highlights

బంగారం ధరలు పరుగులు ఆగలేదు. బంగారంధరలు ఈరోజు (జూన్ 02) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో బంగారం...

బంగారం ధరలు పరుగులు ఆగలేదు. బంగారంధరలు ఈరోజు (జూన్ 02) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (02.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 30 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,120 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 60 రూపాయలు పెరిగింది. దీంతో 49,220 రూపాయలకు చేరింది.

దూసుకెళ్లిన వెండి ధరలు...

బంగారం ధరలు కొద్దిగా పెరిగితే, వెండి ధరలు కూడా దూసుకెళ్లిపోయాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే 40 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రికార్డు మార్కుకు దాటింది. కేజీ వెండి ధర 50,150 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 30 రూపాయలు పెరుగుదల నమోదు చేసి, 45,120 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 60 రూపాయల పెరుగుదల నమోదు చేసి 49,220 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 50,150 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పది గ్రాములకు 190 రూపాయలు పెరిగి 47,700 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 190 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 45,900 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 40 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 50 వేల రికార్డు మార్కు దాటి 50,150 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories