gold rate : మళ్ళీ తగ్గిన బంగారం.. వెండి ధరలూ తగ్గుముఖం!

K V D Varma
Published on: 2 May 2020 6:58 AM IST
gold rate : మళ్ళీ తగ్గిన బంగారం.. వెండి ధరలూ తగ్గుముఖం!
X
gold and silver rate today

వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఈరోజు (మే 2) బంగారం ధరలు దేశీయంగా కిందికి దిగొచ్చాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు భారీ తగ్గుదల నమోదు చేశాయి.

బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శనివారం (02.05.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధర కంటే 540 రూపాయల తగ్గుదల నమోదు చేసి 43,410 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 500 రూపాయల తగ్గుదలతో 46,200 రూపాయలు నమోదు చేసింది.

భారీగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా అదేదారిలో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. కేజీకి 1520 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర దిగివచ్చింది. కేజీ వెండి ధర 41,000 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం ధర కంటే 540 రూపాయల తగ్గుదల నమోదు చేసి 43,410 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 500 రూపాయల తగ్గుదలతో 46,200 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,000 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలోమాత్రం బంగారం ధరలు పెరుగుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయల పెరుగుదలతో 47,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయల పెరుగుదలతో 45,250 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 41 వేల మార్కు కు దిగి వచ్చింది. కేజీ వెండి ధర 41,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-05-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story